NTV Telugu Site icon

KTR: కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా? అరికాళ్లలో ఉందా?: కేటీఆర్

Ktr

Ktr

KTR: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజ‌య్ అయినా.. వ‌దిలిపెట్టమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చ‌ట్టపరంగా కఠినంగా శిక్షిస్తామ‌న్నారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మరణించడం బాధాకరమని.. కానీ ప్రీతి మృతి అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 125 కోట్లతో ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేసిన సంద‌ర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్రసంగించారు.

Read Also: HMDA: హెచ్ఎండీఏ పేరుతో మోసం.. సీరియస్‎గా తీసుకున్న ప్రభుత్వం

ఈ క్రమంలోనే కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐకి భయపడేది లేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా, లేక అరికాళ్లలో ఉందా? అని విమర్శించారు. “మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని ఒకాయన అంటున్నారు… మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి?” అని కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా

ఇదే సందర్భంగా బండి సంజయ్ పైనా కేటీఆర్ ధ్వజమెత్తారు. మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ఆయన అదానికీ దేవుడు కావొచ్చు… మాకు కాదు… తెలంగాణకు పట్టిన పెద్ద శని, దరిద్రం బీజేపీనే అని మండిపడ్డారు. ఎవరికీ దేవుడు. నీకా..? అదానీకా..? 70 రూపాయలు ఉన్న లీటరు పెట్రోలును 115 రూపాయలుకు చేసినందుకు మోడీ దేవుడా..? 400 రూపాయలు ఉన్న ఒక సిలిండర్ ను 1200 రూపాయలు చేసిందుకా..? ఢిల్లీలో700 మంది రైతుల ప్రాణాలు తీసినందుకా..? గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పతనమైనందుకా..? మోడీ దేవుడు’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.