NTV Telugu Site icon

Minister KTR : నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Ktr

Ktr

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 9:45 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం, తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చేరుకుంటారు. తర్వాత ఉదయం 10 గంటలకు జిల్లెల్ల గ్రామంలో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌. ఆ తర్వాత ఆదే గ్రామంలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ కాలేజీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభింస్తారు.

Also Read : Pawan Kalyan: ఇది జరిగితే పక్కా పవన్ ఫాన్స్ కి పూనకాలు లోడింగే…

అనంతరం.. అక్కడి నుంచి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకొని మధ్యాహ్నం 1:30 గంటలకు నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ ని ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు మంత్రి కేటీఆర్. అయితే.. మంత్రి కేటీఆర్‌తో పాటాలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Also Read : CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి