NTV Telugu Site icon

Minister KTR : టాస్క్‌తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాం

Ktr

Ktr

సిద్దిపేటలో మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ హబ్ ని ఇంకా విస్తరిస్తమన్నారు. టాస్క్ తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుందన్నారు మంత్రి కేటీఆర్‌. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు అని ఆయన వెల్లడించారు.

Also Read : Arjun Leela : అర్జున్ లీల.. అసలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే

ఈ 9 ఏళ్లల్లో ఐటీ ఎగుమతులు రెండు లక్షల 41 వేల కోట్లు అని ఆయన అన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదని ఆయన అన్నారు. మన తెలంగాణలో 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో యువత ఎక్కువగా ఉందని, ..వారికి ప్రయివేట్ ఉద్యోగం సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేసీఆర్‌కి హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలని ఆయన కోరారు. సిద్దిపేట రాష్ట్రానికే కాదు దేశానికే స్ఫూర్తి. ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు కేటీఆర్‌.

Also Read : The Earth: ఇప్పుడైతే భూమిపై 24 గంటలు.. ఒకప్పుడు 19 గంటలు మాత్రమే..