Site icon NTV Telugu

Minister KTR : ఈ సారి జరిగే ఎన్నికలు మన తలరాత రాసుకునే ఎన్నికలు

Ktr

Ktr

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం పట్టణంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ సెంటర్ లో స్ర్టిట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ఎన్నికలు మన తల రాత రాసుకునే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ముందు ఉంది కొత్తగూడెం.. ఢిల్లీ మెడలు వంచింది కొత్తగూడెం ప్రజలు అని ఆయన అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వైపు బీజేపీ అడుగులు వేస్తున్న ఒక్క కాంగ్రెస్ ఎంపీ మాట్లాడలేదని, ఈ ఎన్నికల్లో డబ్బు సంచులతో బడా బడా సేట్లు డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు.. వారికి బుద్ధి చెప్పండన్నారు మంత్రి కేటీఆర్‌..

Also Read : Prabhas: ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉంటే ఎలా ప్రభాస్?

అంతేకాకుండా.. ‘షాదీముభారక్, కళ్యాణ లక్ష్మి లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం.. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీ లకు 3 వేల రూపాయలు ఇచ్చే పథకం ప్రవేశ పెట్టాం… కొత్తగూడెం లో ఇంకా విమానాశ్రయం ఏర్పాటు కు కృషి చేస్తాం.. సింగరేణి బతకాలి అంటే కెసిఆర్ ప్రభుత్వం రావాలి అలాగే వనమా గెలవాలి. తొమ్మిదిన్నరేళ్లుగా కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయండి.. ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన సత్తా చాటాలి.. మళ్ళీ ముఖ్యమంత్రి గా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. మూడు గంటల కరెంట్ కావలో 24 గంటల కరెంటు కావలో ప్రజలు నిర్ణయించు కోవాలి..’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Producer SKN: కూతురి పెళ్లికని దాచిన డబ్బును కొట్టేసిన చెదలు.. ‘బేబీ’ సినిమా నిర్మాత కీలక ప్రకటన

Exit mobile version