Minister KTR: నేడు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కు ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు.
Read Also: Kishan Reddy: ‘ముద్ర యోజన’ ద్వారా దేశ ఔత్సాహిక యువతను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. మానుకోటలో రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్ తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ సీరియస్ గా ఎమ్మెల్యే చేయిని తీసి పడేశారు. కేటీఆర్ సీరియస్ గా ఇలా షాక్ ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తోపాటు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.
Read Also: Pawan Kalyan: చరణ్ కు బాబాయ్ మీద అంత ప్రేమ.. కూతురుకు పవన్ పేరు కలిసేలా పెట్టాడు
మరోవైపు పోడు పట్టాల పంపిణీ సభా వేదిక పై కేటీఆర్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. సభాముఖంగా జరిగిన అవమానంతో ఎమ్మెల్యే నరేందర్ వేదికపై చిన్నబోయి కూర్చున్నాడు. పట్టణంలో పర్యటించిన కేటీఆర్ కు జర్నలిస్టులతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.