KTR Tweet: రాబందుల రాజ్యమొస్తే.. రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..! కేటీఆర్ ట్విట్ వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన సమస్యల గురించి చెప్పినా వెంటనే స్పందిస్తారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలపై ట్విట్ చేశారు. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం..వంచన.. ద్రోహం..దోఖాలమయం అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ..! అన్నారు. కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..! అన్నారు. కాలకేయుల కాలం వస్తే.. కరెంట్ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ..! అని నిప్పులు చెరిగారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అంటూ మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ..! అన్నారు. దగాకోరుల పాలనొస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ..! తెలిపారు. బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ..! అంటూ ట్వీట్ చేశారు.
సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే.. సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ..! అన్నారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే.. ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ..! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే.. సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటీ..! అన్నారు. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ…! అని తెలిపారు. స్కాముల పార్టీకి స్వాగతం చెబ్తే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ..! అన్నారు. కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ..! అన్నారు. పరిపాలన చేతగాని.. చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే.. పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ..! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే.. పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ..! అన్నారు. బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ..! అన్నారు. విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ..! అని, థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ..! అంటూ ట్వీట్ చేశారు. ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ..! అని మండిపడ్డారు. జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే.. పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ..! అన్నారు. దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు..నా తెలంగాణ..! అన్నారు. ఈనగాచి నక్కల పాల్జేసేంత.. అమాయక నేల కాదు నా తెలంగాణ..! అంటూ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
మోసం..వంచన.. ద్రోహం..దోఖాలమయం
కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా..!ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన
తెలివైన తెలంగాణ గడ్డ..!కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..!
……..
రాబందుల రాజ్యమొస్తే
రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..!కాలకేయుల కాలం వస్తే
కరెంట్ కోతలు..కటిక…— KTR (@KTRBRS) September 18, 2023
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!