NTV Telugu Site icon

29Years Back KTR Bike: 29 ఏళ్ల క్రితం కేటీఆర్ కాలేజీకి ఏ బైక్ పై వెళ్లే వారో తెలుసా !

Ktr Bike

Ktr Bike

29Years Back KTR Bike: ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు కలిగిన అనుభూతిని తన అభిమానులతో సోషల్ మీడియాతో పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కాలేజీకి తాను వేసుకెళ్లిన బైకును గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ బైక్ చెక్కు చెదరలేదంటూ చెప్పుకొచ్చారు. 29 ఏళ్లు అయినా మంచి కండిషన్‎లో ఉందని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు కేటీఆర్. రెండు రోజుల కిందట ఈ అందమైన ప్రదేశం ఎక్కడ అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సందించిన విషయం తెలిసిందే.

తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోని షేర్ చేశారు మంత్రి కేటీఆర్. తాను స్టూడెంట్‌గా ఉన్న టైమ్‌లో నిజాం కళాశాలలో నడిపిన బైక్ ఉంద‌ని అది ఇంకా చెక్కు చెదరలేదని తెలిపారు. తన పాత బైక్ ను గుర్తు చేస్తూ జాన్సన్ అనే వ్యక్తికి థ్యాంక్స్ చెప్పారు. 24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఇప్పుడు కూడా బైక్ పై తిరగాలని ఉంద‌ని జాన్సన్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన వెంట‌నే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు.

Show comments