తొమ్మిదేళ్ళ కిందట రాష్ట్రంలో ప్రజా వైద్యం ఎలా వుంది ఇప్పుడు ఎలా వుందంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందన్నారు మంత్రి కేటీఆర్. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యఆరోగ్య శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఏరియా హాస్పిటల్ తో పాటు.. జిల్లాల్లోని ప్రతీ ప్రైమరీ హాస్పిటల్ సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయని ఆయన కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యం పైనే ఎక్కువ ఖర్చు అవుతుందని, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నీతి అయోగ్ లో ఒకప్పుడు 24 వ స్థానం వుంటే ప్రస్తుతం 3 వ స్థానం లో వున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మానవీయ మనసున్న ప్రభుత్వము ఎలా వుండాలో తెలంగాణ ప్రభత్వం చేసి చూపెడుతుందన్నారు. హనుమాన్ గుడి లేని ఊరు లేదు.. కేసిఆర్ పథకం అందని ఇల్లు లేదని, ఆశా వర్కర్లకి దేశంలోని మిగతా రాష్ట్రంలో ఎంత వేతనం వుంది.. మన రాష్ట్రంలో ఎంత వుందో తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ప్రతీ ఒక్కరికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Revanth Reddy : ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య
స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. గుడులు, బడులను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను అభివృద్ధి చేసిన మాదిరే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ స్కూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read : Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కోర్టు సమన్లు..