ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడులో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఎలావీలైతే అలా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే ప్రచారాల్లో జోరు పెంచారు. అయితే నిన్న నేతలతో టీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్ర కేటీఆర్ చేనేతలకు వరాల జల్లు కురిపించారు.
Also Read : Minister KTR: మునుగోడులో గెలిచేది మేమే..డౌటే లేదు
అంతేకాకుండా.. చేనేతలపై వేసిన కేంద్రప్రభుత్వంను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో చేనేత వస్ర్తాలపై జీఎస్టీ తొలగించాలని ప్రధాని మోడీకి లేఖ రాస్తానన్నారు. అయితే.. ఈ మేరకు నేడు ప్రధానమంత్రికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డ్ రాశారు. తన స్వదస్తూరీతో పోస్ట్ కార్డ్ రాశారు మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలతోపాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలన్నారు.