Site icon NTV Telugu

Minister KTR : ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే

Ktr

Ktr

తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారని, ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో ఇప్పుడు చెప్పొచ్చు అన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోందని, ఆషామాషీగా ఇక్కడున్న పేర్లు పథకాలకు పెట్టలేదని ఆయన అన్నారు. దళితులు తెలంగాణలో గొప్పగా ఎదుగుతున్నారని, ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే ఓటు హక్కు ఉందని, అదానీకైన, మనకైన ఒకటే ఓటు హక్కు అని ఆయన అన్నారు. మతాలు, కులాలు మనకు మనం పుట్టించుకున్నవే అని, రెండెకరాల స్థలాన్ని రేపు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దళిత గిరిజనులకు దండు మల్కాపూర్ లో డిక్కీ కు ఇప్పిస్తామన్నారు.

Also Read : CM Yogi: అసద్ ఎన్‌కౌంటర్.. వైరల్ అవుతున్న సీఎం యోగి “మట్టిలో కలిపేస్తా” కామెంట్స్..

ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారమని, లేదంటే ఎవరైనా చెత్త బుట్టలో ఉండాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. దళిత బంధు లాంటి పథకం కేసీఆర్‌ లాంటి దమ్ము నాయకుడుతోనే సాధ్యమన్నారు మంత్రి కేటీఆర్‌. రెండు మొక్కలు నాటమంటే ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి చేత కాదని, అది కూడా కేసీఆర్‌ వల్లనే సాధ్యమైందన్నారు. 64లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో పండేది కానీ ఇప్పుడు 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పుడు పండుతోందన్నారు. తెలంగాణ వచ్చాక ధరలు భారీగా పెరిగాయని, ఇంటింటికి వంద శాతం నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసిఆర్ ది అన్నారు. గుజరాత్ లో 12 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని, ఏ పని చేసిన హేళన చేసేవాళ్ళు ఉంటారన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా రిజర్వాయర్ లో నీళ్ళు నిండుకుండలా ఉన్నాయని, నీళ్ళు వచ్చాయా, ఎక్కడున్నాయి అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, నేను చూపిస్తా రమ్మంటే ఎవడు రాడు.. పైకి మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Atiq Ahmed: కొడుకు ఎన్‌కౌంటర్‌తో ప్రాణం విలువ తెలిసినట్లుంది.. కోర్టులోనే గుక్కపెట్టి ఏడ్చిన అతీక్ అహ్మద్

Exit mobile version