వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యనే అని మంత్రి కే తారకరామారావు అన్నారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్ఎస్ బయటపెట్టినందున.. దాని నుంచి దృష్టి మరలించేందుకు కేంద్రం స్పందించిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా ఆపేదాకా… బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేదాకా కేంద్రం పైన ఒత్తిడి కొనసాగుతుంది అని ఆయన అన్నారు.
Also Read : Aadhaar Card : ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ?
అంతకుముందు మధ్యాహ్నం కేటీఆర్ మాట్లాడుతూ.. తమ వల్లే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందన్నారు. తమతో పెట్టుకుంటే అట్లుంటదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందున్నారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం ఒక ప్రకటన చేసిందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దెబ్బంటే అలా వుంటుందని మంత్రి అన్నారు.
Also Read : GT vs PBKS: ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 153 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు