Punjab Kings Scored 153 Runs In 20 Overs Against Gujarat Titans: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పంజాబ్ జట్టు 153 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. పంజాబ్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ అర్థశతకం చేయలేదు. మాట్ షార్ట్ ఒక్కడే 36 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22 పరుగులు) కాస్త మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ 150 పరుగుల మైలురాయిని దాటగలిగింది.
GT vs PBKS: ఓవైపు వికెట్లు.. మరోవైపు పరుగులు.. నెట్టుకొస్తున్న పంజాబ్
తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే.. పంజాబ్ జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సున్నా పరుగులకే ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధవన్ (8) కూడా పెలివియన్ చేరాడు. మాట్ షార్ట్ (36) బాగానే కుదురుకున్నాడని అనుకునేలోపే.. అతడు కూడా 55 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం భానుక రాజపక్స, జితేశ్ శర్మ కలిసి ఆచితూచిగా ఆడుతూ.. జట్టుని ముందుకు నడిపించారు. అయితే.. గుజరాత్ బౌలర్ల ముందు వీళ్లు ఎక్కువసేపు నిలకడగా క్రీజులో ఉండలేకపోయారు. క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. అయితే.. వచ్చిన వాళ్లు కొద్దోగొప్పో తమవంతు సహకారం అందించి.. జట్టు స్కోరు బోర్డును ముందుకు నడిపించగలిగారు.
Mouni Roy: ‘నాగిని’వో, భోగినివో.. కామకళా యోగినివో
చివర్లో పంజాబ్ బలహీనపడటం చూసి.. స్వల్ప స్కోరుకే చాపచుట్టేస్తుందని అందరూ భావించారు. అప్పుడు షారుఖ్ ఖాన్ అనూహ్యంగా షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టి అతడు జోష్ నింపాడు. కానీ.. పరుగులు చేయాలన్న ఆవేశంలో అతడు రనౌట్ అయ్యాడు. చివర్లో బ్రార్ ఒక సిక్స్ కొట్టాడు కానీ, అదే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడం.. పంజాబ్ జట్టుకి నష్టం వాటిల్లింది. చివరగా.. 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలా వికెట్ తీసుకున్నారు. మరి.. 154 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్ ఛేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!