Minister KTR : ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ నిర్వహించిన బీసీ బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. పేదలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కులవృత్తులను నమ్ముకున్న వారి కోసం పథకాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. అందరి కంటే ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళితబంధు అమలు చేస్తున్నామని, అంతే కాకుండా 14 వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఈ పథకం కింద 10 వేల దరఖాస్తులొచ్చాయి.. ఇవాళ తొలివిడతలో 600 మందికి ఇస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే నెలలో మరికొందరికి ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : CCTV Camera: టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు.. చోరీ జరగకుండా రైతు వినూత్న ఐడియా
Also Read
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తామని, వేములవాడ నుంచి కొందరు నార్లు వేస్తుంటే ..వాళ్ళను అడిగితే బెంగాల్ నుంచి వచ్చామన్నారని, ఇక్కడి నేతన్నలకు కూలి దొరకాలని బతుకమ్మ చీరల ఆర్డర్ తీసుకొస్తే అందులో పని చేస్తున్న వారంతా ఇతర రాష్ట్రాల వాళ్ళే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 12లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింద నిధులిచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. పథకాల కింద వచ్చే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, సెప్టెంబర్ లో సిరిసిల్లలో మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. మహబూబాద్ వెళ్ళినప్పుడు అక్కడి మెడికల్ కాలేజీ లో తెలుసుకుంటే 140 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని, రైతు బీమానే కాదు.. నేతన్న బీమా కూడా మొదలు పెట్టామన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Hima Varsha Reddy : శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట
గతంలో పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతే.. వారి సంబంధీకులకు ఆ పింఛన్ వెంటనే బదిలీ చేసేటట్లు ఆదేశాలు ఇచ్చామని, బీసీ బంధు కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్రమే.. మీరు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నియోజక వర్గానికి 3000 చొప్పున గృహలక్ష్మి కింద ఆర్థిక సహాయం చేస్తాం ..జిల్లాలో ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఏదైనా మొదలు పెడితే పక్క నియోజక వర్గాల వాళ్ళు ఏడుస్తున్నారు.. అందుకే సీక్రెట్ చేస్తున్నా.. ఓట్లప్పుడు మందు పంచడం.. డబ్బులివ్వడం లాంటి అలవాటు లేదు.. మీరు కరుణిస్తే మళ్ళీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూచుంటా అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!