Minister KTR : రోడ్‌రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్, మంత్రి కె. తారక రామారావు అన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్‌రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్‌రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
Also Read
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ జాతీయ నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని, మునుగోడులో ఓటమి తప్పదు అనే బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!