NTV Telugu Site icon

Kottu Satyanarayana : చంద్రబాబు డైరెక్షన్‌తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారు

Kottu Satyanarayana

Kottu Satyanarayana

ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే.. పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల తరువాత వైసీపీ శ్రేణులు సైతం అంతే ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా.. జనసేన నేతలను నుంచి వైసీపీ నేతలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్‌ రిపోర్టు కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీవీతో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన నాయకులు అసహనంతో వున్నారు..రూల్స్ అంటే వారికి లెక్కలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారని ఆయన ఆరోపించారు.
Also Read : Diwali Crackers : మార్కెట్‌లో జగన్‌ ఆటమ్‌ బాంబులు.. మాములుగా ఉండదు..

డైలాగులు, ఫైట్లు ఎంత ఎక్కువ చేస్తే ఆ సినిమా హిట్టు అవుతుందనే ఫార్ములాతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వుండేవాళ్ళు అద్దాల మేడలో వుంటారనే విషయాన్ని పవన్ మర్చిపోతున్నారని, 2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో రౌడీయిజాన్ని రూపుమాపాం.. నాపై దాడులు జరిగే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. పవన్ మహిళపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోయిందని, అంపశయ్యపై వున్న టీడీపీనీ బ్రతికించే ప్రయత్నం పవన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతీయ వివాహ వ్యవస్థను అవమానించే విధంగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.