NTV Telugu Site icon

Kottu Satyanarayana: పవన్‌ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సెక్షన్ 30 కొత్తది కాదు..!

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రకు సిద్ధం అవుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు పోలీసులు.. అయితే, దీనిపై జనసేన నేతలు భగ్గుమంటున్నాయి.. పవన్‌ యాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా కుట్రలు చేస్తుందని ఫైర్‌ అవుతున్నారు నేతలు.. అయితే, పవన్ కల్యాణ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదంటున్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. సెక్షన్ 30 అనేది కొత్తగా తీసుకువచ్చింది కాదన్న ఆయన.. సెక్షన్ 30 అమలు తప్పుబట్టే ముందు.. ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే 15 వేల మంది పోలీసులను పెట్టి ఆయన కుటుంబాన్ని హింసించారు.. అప్పుడు పవన్ కల్యాణ్‌ ఎవరిని తప్పుబట్టారు..? అని ప్రశ్నించారు.

Read Also: Rainbow Childrens Hospital: ప్రతిష్ఠాత్మకమైన జేసీఐ అక్రిడిటేషన్‌ పొందిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్

ఇక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధితో పోటీ పడగలరా.? అని ప్రశ్నించారు మంత్రి కొట్టు.. ఆంధ్రలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా ? అని నిలదీశారు. ఏపీలో బీజేపీ కాలు పెట్టేందుకు గుండు సూది అంత సందైన దొరుకుతుందేమో అని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయానికి ఎన్ని తరాలైన రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు అవకాసం ఇవ్వరని స్పష్టం చేశారు. చంద్రబాబు వందల కోట్లు దోచుకోవడానికి అవకాశం కల్పించింది బీజేపీనే అని ఆరోపించారు.. ఇక, ప్రత్యేక హోదా, పోలవరం విషయాల్లో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.. మరోవైపు.. చంద్రబాబు కోసం ప్రచారం మొదలు పెట్టేందుకు పవన్ కల్యాణ్‌ సిద్ధమయ్యారు.. చేసుకుని ఇవ్వండి అంటూ వారాహి యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Show comments