NTV Telugu Site icon

Minister Kottu Satyanarayana: పవన్‌పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.!

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Minister Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్‌యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్‌ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులంలోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారు… కానీ, పొత్తు నిర్ణయాలతో పార్టీని అధః పాతాళంలోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి వారాహి యాత్ర చేపట్టి పవన్ కల్యాణ్‌ ఏమని చెబుతారు..? అంటూ సవాల్‌ చేశారు. ఎవరైనా ఏ పార్టీతోననైనా పొత్తు పెట్టుకోవచ్చు.. కానీ, టీడీపీతో పవన్ కల్యాణ్‌ పొత్తు పెట్టుకోడానికి కాపు సామాజిక వర్గం అభ్యంతరం చెబుతోందన్నారు.

Read Also: Siddharth: ఆమెను చూసి స్టేజిమీదనే కళ్లనీళ్లు పెట్టుకొని.. కాళ్లు పట్టుకున్న సిద్దార్థ్.. ఎవరామె ..?

కాపు సామాజిక పెద్దగా నా వద్దకు వచ్చిన సూచనలే పత్రికా సమావేశంలో వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఇక, ఇప్పటికే వారాహి యాత్రకు మూడు సార్లు బ్రేకులు వేశారని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు.. బీజేపీ పెద్దలలో కలిసినా, పవన్ కల్యాణ్‌తో కలిసినా ఒరిగేది ఏమీ లేదని సెటైర్లు వేశారు.. 2014లో టీడీపీ నేతలు లేని పోని హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.. రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఫైర్‌ అయ్యారు.. ఇచ్చిన హమీల్లో ఏం నెరవేర్చారని టీడీపీకి ఓటు వేయాలని నిలదీశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని.. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయని.. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్న విషయం విదితమే..

Show comments