Site icon NTV Telugu

Kottu Satyanarayana: పవన్ కల్యాణ్‌ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది.. అది స్పష్టం..!

Kottu On Pawan Kalyan

Kottu On Pawan Kalyan

Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది అని జోస్యం చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. కలిసి పోటీ చేయటం అంటే ఒంటరిగా పోటీ చేయలేం అనే కదా? అని వ్యాఖ్యానించారు. ఇక, నారా లోకేష్ ది యువగళమా? గందరగోళమా? బౌన్సర్లతో, రాజకీయ కూలీలతో చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది? దీనికి రూ.250 కోట్ల ఖర్చు అయ్యిందని టీడీపీ వాళ్లే చెబుతున్నారని దుయ్యబట్టారు.. మాలోకం వంద పుస్తకాలు పూర్తి అయ్యాయని అంటున్నాడు.. రాష్ట్రంలో ఉన్న అందరి పేర్లు రాసుకుంటున్నాడా? అందరినీ జైలుకు పంపిస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు కొట్టు సత్యనారాయణ.

Read Also: Mallikarjun Kharge: బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు

మరోవైపు.. గతంలోనూ పవన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. తనకు ప్రాణహాని ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఆ ముప్పు చంద్రబాబు నుంచే ఉందని పవన్ గ్రహించాలని వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తమ్ముడూ పవన్ కల్యాణ్.. చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు అంటూ సలహా ఇచ్చారు.. చంద్రబాబును జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలన్న ఆయన.. వంగవీటి మోహనరంగా హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం కూడా ఉందని చెప్పుకొచ్చారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌కు ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీపైకి నెట్టేసి.. రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టిన విషయం విదితమే.. సొంతంగా పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టాలని మంత్రి కొట్టు సత్యనారాయణ బహిరంగ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

Exit mobile version