NTV Telugu Site icon

Kottu Satyanarayana: చంద్రబాబు అనే శని పవన్ నెత్తిమీద ఉంది.. అందుకే అలా..!

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి.. పవన్‌ కామెంట్లపై మరోసారి మండిపడ్డారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కట్యాణ్‌ మాటలు పిచ్చివాడిలా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు అనే శనిగాడు పవన్ నెత్తిమీద ఉన్నాడు.. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. వాలంటీర్లు మన పిల్లలే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు .. మన ఇంట్లో వాళ్లే వలంటీర్లు అయ్యారు.. అన్ని ప్రామాణికలు పాటించిన తర్వాతే వాలంటీర్ ఎంపిక జరిగిందన్నారు కొట్టు సత్యనారాయణ. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ప్రకారమే వాలంటీర్ ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. పవన్ మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి. చంద్రబాబు అనే శనిగాడు పవన్ నెత్తిమీద ఉన్నాడు.. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ..

Read Also: Rohit Sharma: సన్నబడ్డ రోహిత్.. విండీస్ టూర్ లో దుమ్ము దులపడమే..

కాగా, వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో మంటలు రేపడంతో.. మరోసారి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం విదితమే.. అతిచిన్న జీతం తీసుకునే వాలంటీర్ వ్యవస్థ పొట్టగొట్టాలని నాకులేదన్న ఆయన.. ఐదువేల జీతం ఇచ్చి వారిని అక్కడే కట్టిపడేస్తున్నారు.. వారిలో ఎంతోమంది బలవంతులున్నారు.. వారిలో సైంటిస్టులు, వ్యాపారస్తులు ఇలా ఎంతో టాలెంట్‌ ఉన్నవాళ్లున్నారన్నారు.. డిగ్రీ చదువుకుని ఐదువేలు ఇస్తూ ఊడిగంచేపిస్తున్నారు.. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చే డబ్బులు కూడా వారికి రావడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం ఎక్కువ కావడంతో ఐదువేలకు పనిచేస్తున్నారు.. శ్రమదోపిడి జరుగుతోంది.. రాష్ట్రంలో ఇన్నివేల మంది మిస్సవుతున్నారనేది చెబితే ఎందుకు పట్టించుకోవడంలేదు అని మండిపడ్డారు పవన్.. కేంద్ర నిఘావర్గాలు దీనిపై చాలా లోతైన విచారణ చేస్తున్నారు.. ఐదువేల రూపాయలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారు.. మీ వివరాలు మొత్తం వారిచేతుల్లో పెట్టాల్సి వస్తోందన్నారు. అందరి వాలంటీర్స్‌ గురించి నేను మాట్లాడటం లేదు.. కానీ, కొన్ని చోట్ల వాలంటీర్స్‌ వద్ద ఉన్న డేటా బయటికి వెళ్తోంది.. రెవెన్యూవ్యవస్థ బలంగా ఉన్నా సమాంతర వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించిన విషయం విదితమే.