NTV Telugu Site icon

Minister Kondapalli Srinivas: న్యూయార్క్‌లో వివిధ రంగాల ప్రముఖులతో మంత్రి శ్రీనివాస్ భేటీ

Minister Srinivas

Minister Srinivas

Minister Kondapalli Srinivas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు. సామాజిక ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు అర్థం చేసుకోవడానికి సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సాంకేతిక మరియు సమ్మిళిత అభివృద్ధి కేంద్రం “మాస్టర్ కార్డ్ కేంద్ర కార్యాలయం”లో పలువురు ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. మాస్టర్‌కార్డ్ కేంద్ర కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణాలు ఇచ్చే సంస్థ ప్రతినిధులతోపాటు లబ్దిదారులు పలువురు మంత్రిని కలిసి తమ ఆర్థిక ప్రగతికి,తాము సాధించిన విజయాలు తదితర అంశాలపై చర్చించారు.

Read Also: Nara Bhuvaneshwari: పండుగలకు చేనేత వస్త్రాలు ధరిద్దామంటూ నారా భువనేశ్వరి పిలుపు

అప్‌సైడ్ ఫుడ్స్ కు చెందిన ఉమా వలేటి మంత్రితో సమావేశమయ్యారు, ఆయనకు చెందిన కంపెనీ సాంకేతికతతో మాంస పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేస్తోందని తెలిపారు. అప్‌సైడ్ పుడ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎగుమతి ఆధారిత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిథులు మంత్రికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో దూరదృష్టి గల నాయకుడు చంద్ర బాబు నాయుడు ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేద ఫంక్షనల్ యూనివర్సిటీ గురించి నిపుణుడు సౌమిత్ చింతలతో కలిసి మెటా కంపెనీ ఎజెండా ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం పై మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో కృత్రిమ మేధ ద్వారా డిజిటల్ ఉద్యోగాలను పొందడం, బెంచ్‌మార్క్ డేటాసెట్‌లను నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దీనివల్ల చుట్టూ మరిన్ని మోడల్‌లు మరియు అప్లికేషన్‌లు నిర్మించబడతాయని సౌమిత్ చింతల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు వివరించారు.