Minister Kondapalli Srinivas: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రస్తుతం కంట్రోల్‌లో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 13న తొలి డయేరియా కేసు నమోదైందని తెలిపారు. గుర్లలో ఎనిమిది మంది మృతి చెందినా.. ఇప్పటి వరకు డయేరియాతో మృతి చెందిన వారు ఒక్కరేనన్నారు. కేవలం గుర్ల గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితం కావడం మూలంగానే డయేరియా వ్యాపించిందని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా నీరు అందంచడం ద్వారా వచ్చిందని చెబుతున్నారని.. ఇది అవాస్తవమన్నారు.
Read Also: Minister Kollu Ravindra: ఏపీలో మద్యం పాలసీపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం చంపావతి నుంచి నీటి సరఫరా నిలిపి వేశామన్నారు. నాగావళీ నది నుంచి గుర్ల గ్రామానికి నీరందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇంకా 40 మంది వైద్యం తీసుకుంటున్నారని.. గుర్లలో ఇంకా వైద్య శిబిరం కొనసాగిస్తామన్నారు. 14 వ తేదీ 21, 15 వ తేదీ 81, 16 వ తేదీ 58, 17 వ తేదీ 32, 18 వ తేదీ 18.. మొత్తం 210 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం 40 కేసులు ఆస్పత్రిలో ఉన్నాయన్నారు. ఒకరు మాత్రమే డయేరియాతో చనిపోయారన్నారు. ఒక్క గొర్ల గ్రామంలో మాత్రమే డయేరియా ఉందని.. పక్క గ్రామాల్లో డయేరియా లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అయినా సరే ముందు జాగ్రత్త చర్యగా పక్క గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెడతున్నామని మంత్రి స్పష్టం చేశారు.