రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమి నాలుగో సమావేశానికి తేదీ ఖరారు.? సీట్ల సర్దుబాటే ప్రధాన ఎజెండా..
ఈ సందర్భంగా.. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు, పండితులు మంత్రి దంపతులను కలిసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Vidyut Jammwal: అడవుల్లో నగ్నంగా స్టార్ హీరో.. వర్మ సంచలన వ్యాఖ్యలు