NTV Telugu Site icon

Minister Konda Surekha: ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం!

Konda Surekha

Konda Surekha

Minister Konda Surekha: రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు. మా ప్రభుత్వంలో ఇది మొదటి ఇన్సిడెంట్.. చాలా బాధగా ఉందన్నారు. నిమ్స్‌లో ఆ అమ్మాయికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని, కానీ ఆమె చనిపోయిందన్నారు. మీ ప్రభుత్వంలో ఎవరినైనా చనిపోతే ఆదుకున్నారా? అంత బాధ మీకు ఉంటే ఆ అమ్మాయి కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇన్సిడెంట్లు అయ్యాయి కానీ ఒక్క సారి కూడా అక్కడికి వెళ్ళలేదన్నారు.

మా ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులు అయిన అధికారులను కూడా సస్పెన్షన్ చేశామన్నారు. ఫుడ్ పాయిజన్ వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని తెలిసిందన్న మంత్రి.. పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని నడవకుండా చేయాలని ఒక ప్రణాళికతో డ్రామాలు చేస్తున్నారన్నారు. లగచర్లలో కలెక్టర్‌ను మర్డర్ చేయాలని చూశారని మంత్రి అన్నారు. మీరు మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల ఉసురు తీసుకోలేదా అంటూ ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయం కోసం 254 ఎకరాలు భూ సేకరణ చేస్తామన్నారు. గతంలో మహబూబాబాద్‌లో గిరిజనులను కొట్టించి మళ్ళీ అక్కడ మహా ధర్నా ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Read Also: Minister Komatireddy: వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం.. మంత్రి కీలక ప్రకటన

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏండ్లు అధికారంలో ఉంటుంది అది కూడా తెలవదా కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ సోదరి లోపల ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నాడన.. కానీ బయట వచ్చిన నాటి నుండి భయపడుతున్నాడన్నారు. కవిత, హరీష్ ఒక్కటయ్యారని కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్ కవితకు ప్రియారిటీ ఇస్తున్నారు అని కేటీఆర్ భయపడుతున్నారన్నారు. మా ఏడాది పాలనలో ఏమి చేశామో మేము చెపుతామన్నారు. ఆర్ ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని గతంలో బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని మంత్రి పేర్కొన్నారు. గతంలో 99 కోట్ల రూపాయలు టెండర్లు లేకుండా ఖర్చు చేశారన్నారు. 103 బీఆర్‌ఎస్ నేతల బంధువుల భవనాలు గురుకులాలకు కిరాయికి ఇచ్చారన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ అనుచరగణం లక్షల రూపాయల గతంలో వసూలు చేశారని ఆరోపించారు. దళిత ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడానికి బీఎస్పీలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యారని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని.. ఆయన అనుచరగణం ఉన్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గతంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాఫియా నడిపాడన్నారు. మాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పెయిడ్ సోషల్ మీడియా వాళ్లకు భార్యలు తల్లులు లేరా.. పరిమితికి మించి ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారన్నారు.

 

Show comments