Toxins : బాడీలోని టాక్సిన్స్‌ని బయటకుపంపే 7 అద్భుతమైన కషాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మురికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే టాక్సిన్స్ బయటకు వెళ్ళాలి. మరి వీటిని వదిలించుకోవాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్‌తో బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది, తక్కువ సమయంలోనే రీసెట్ అవుతుంది. అది కూడా కేవలం ఒకటి రెండు కాదు. బాడీ డిటాక్స్ చేయాలంటే సోమవారం నుంచి ఆదివారం వరకు అంటే మొత్తం ఏడు రోజుల పాటు ఈ డిటాక్స్ డ్రింక్స్‌ని తాగాలి. ఇలా చేస్తే ఒక్క వారంలోనే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. మరి ఆ 7 రకాల డ్రిక్స్ ఏంటో చూసేదాం రండి..
సోమవారం :-
మొదటి రోజు జీలకర్ర, ధనియాలు, సోంపుతో ఈ డ్రింక్ తయారు చేసుకోవాలి. ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలి. రెండు కప్పుల నీళ్లలో వీటిని వేయాలి. దాదాపు 5 నిముషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత వడబోసి ఈ నీళ్లు తాగాలి. జీర్ణ సమస్యలను తగ్గించే డ్రింక్ ఇది. మొత్తం టాక్సిన్స్ అన్నీ ఒక్కసారిగా బయటకు వెళ్లిపోతాయి. ఉదయమే తాగితే ఇంకా రీఫ్రెషింగ్‌గా ఉంటుంది.
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
మంగళవారం :-
వేపాకు అనగానే చీ చేదు అంటారు కానీ అందులో ఉన్న అని ఔషధాలు మరి వీటిలో ఉండదు. కనుక వేపాకు, పసుపు తో తయారు చేసిన డిటాక్స్ వాటర్ తీసుకోవాలి. ముందుగా 5 వేపాకులు, దీంతో పాటు పావు టేబుల్ స్పూన్ పసుపు, ఓ గ్లాసు నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. ఆ మరిగిన నీళ్లలో పసుపు, వేపాకులు వేయాలి. ఈ వాటర్ ని వడపోసి తాగాలి. అయితే.. వేపాకులను ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాడాలి. ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా లివర్ పనితీరు మెరుగు పడుతుంది.
బుధవారం :-
బూడిద గుమ్మడి కాయతో ఎన్ని ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బాడీ హైడ్రేషన్‌కి ఇది చాలా మంచిది. శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడంలో ఇది బాగా తోడ్పడుతుంది. అయితే ఓ కప్పు బూడిద గుమ్మడి కాయను తీసుకోవాలి. దీంతో పాటు నిమ్మకాయ అవసరం. రుచి కోసం కాస్తంత రాక్ సాల్ట్ తీసుకోవచ్చు. ముందు బూడిద గుమ్మడి కాయ ముక్కలను మిక్సీ పట్టుకుని.. ఆ తర్వాత వడబోయాలి. ఆ రసంలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. చివర్లో చిటికెడు రాస్ సాల్ట్ కలుపుకుని ఉదయం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గురువారం :-
త్రిఫల డ్రింక్ తీసుకుంటే పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది. త్రిఫల అంటే ఉసిరి, కరక్కాయ,తానికాయతో తయారు చేసిన త్రిఫల చూర్ణం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది బాగా పని చేస్తుంది. అర టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణంలో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లలో మిక్స్ చేయాలి. ఉదయం తాగితే బరువు కంట్రోల్ లో ఉండడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. కడుపు పూర్తిగా శుభ్రమైపోతుంది.
శుక్రవారం :-
అల్లం, తులసి డిటాక్స్ డ్రింక్ కూడా చాలా మంచిది. దీంతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు మెటబాలిజం మెరుగవుతుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. మలబద్ధకం కూడా తొలగిపోతుంది. ఇందుకోసం ముందు 5 తులసి ఆకులు తీసుకోవాలి. దీంతో పాటుగా ఓ చిన్న అల్లం ముక్క, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు తీసుకోవాలి. రెండు కప్పుల నీళ్లలో వీటిని వేసి బాగా మరిగించాలి. దాదాపు పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బాగా మరిగిన తర్వాత వడబోసి కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
శనివారం :-
తిప్పతీగకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది ఎలాంటి సమస్యలనైనా ఔషధంగా పనిచేస్తుంది. బాడీ డిటాక్స్ చేయడంలోనూ ఇది మంచి ఆప్షన్. ఓ టేబుల్ స్పూన్ తిప్పతీగ పొడి ని తీసుకోవాలి. లేదా తిప్పతీగ కాండం అయినా వాడుకోవచ్చు. ఓ గ్లాసు నీళ్లను గిన్నెలో పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగే టైమ్‌లో ఈ పొడిని అందులో వేయాలి. కనీసం పది నిముషాల పాటు మరిగించి తర్వాత వడబోసి ఈ నీళ్లు తాగాలి.
ఆదివారం :-
మునగాకులో ఎన్నో లాభాలున్నాయి. కానీ చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఓ టేబుల్ స్పూన్ మునగాకు పొడి తో బాడీ డిటాక్స్ అవుతుంది. ముందు ఓ గ్లాస్ నీళ్లు బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మునగాకు పొడి, నిమ్మరసం కలపాలి. 5 నిముషాల పాటు మరిగించాలి. మునగాకు తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఈ రసాన్ని వడబోసి ఉదయమే తీసుకుంటే శరీరంలో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
క్రమం తప్పకుండా ఈ ఏడు డ్రింక్ తీసుకుంటే వారం లోనే మీ శరీరంలో మార్పులు చూస్తారు.
- Tags
- 7 amazing potions
- toxins
తాజావార్తలు
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?