Konda Surekha : కేటీఆర్ ట్విట్టర్, ప్రెస్ మీట్‌లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు
- కేటీఆర్ తెలంగాణ మహిళా సమాజం ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
- బ్రేక్ డ్యాన్సులకు అలవాటుపడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారు
- రైతాంగంపై బీఆర్ఎస్ నాయకులది కపట ప్రేమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల పై తెలంగాణ వ్యాప్తంగా మహిళలు బాధతో పాటు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్టీనేతల ముందు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మీడియాముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని మంత్రి సురేఖ డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నిరంకుశ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు అధికారాన్ని దూరం చేసిన బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని అన్నారు.
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఉచిత ప్రయాణ పథకం పట్ల బీఆర్ఎస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని మహిళలు వైద్యారోగ్య సదుపాయలు, ఇతర అవసరాల కోసం వాడుకుంటూ ఎంతో నిబ్బరంగా ఉంటున్నారని అన్నారు. క్లబ్బుల్లో, పబ్బుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసిన చరిత్ర నీకుండవచ్చు గానీ, మహిళా సమాజాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. రైతుల పై బీఆర్ఎస్ ఒలకబోస్తున్న ప్రేమ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి సురేఖ విమర్శించారు. పదేళ్ళ పాలనలో మీరు రైతాంగానికి చేసింది ఏమీ లేదని మంత్రి అన్నారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి బిఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ అమలు చేసి చూపించిందని మంత్రి స్పష్టం చేశారు.
Hernia: హెర్నియా సమస్య అంటే ఏమిటి..? దీని వల్ల జరిగే ప్రమాదాలు ఇవే..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మహిళలను అవమానించారని బీఆర్ఎస్ చేసిన కుట్ర వికటించిందని మంత్రి సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహరహం శ్రమించి, బిఆర్ఎస్ కుట్రలను ఛేదించి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగాడని అన్నారు. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిగారిని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం లేదని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!