Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. కేసీఆర్‌ కూడా చెప్పారు..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు. కాంగ్రెస్ వేవ్‌తో మా నేతలు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లు మా ప్రభుత్వమేనన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. ఆగస్టు 15 లోపు 2లక్షల రుణ మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ మతి భ్రమించి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. చిహ్నంపై అందరితో చర్చించి నిర్ణయం ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అందరు రావులే ఉన్నారని ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదన్నారు. ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని.. వస్తారా రారా అన్నది ఆయన విజ్ఞతకు వదిలేస్తామన్నారు.

Read Also: AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

జూన్‌లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తారని.. అభివృద్ధిపై సమీక్షలు ఉంటాయన్నారు. బీఆర్‌ఎస్‌ ఒక్క ఎంపీ సీటు గెలవదని.. ఫలితాల తర్వాత ఆ పార్టీ ఉండదన్నారు. బీజేపీ జూటా పార్టీ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మోడీ ప్రధానిగా చేసిన అభివృద్ధి చెప్పకుండా.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశారని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని.. ఎంత మంది లోపలికి వెళ్తారు అన్నది త్వరలో తెలుస్తుందన్నారు.

Exit mobile version