NTV Telugu Site icon

KomatiReddy Venkat Reddy: నల్గొండ బైపాస్ పై అధికారులతో మంత్రి చర్చలు..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

నల్గొండ రూపురేఖలను మార్చేసే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో రూ.524.85 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగు లేన్లుగా 14 కి.మీ నిర్మిస్తున్న ఈ రోడ్డును ఎలక్షన్ కోడ్ ముగియగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా పూర్వపనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also: T20 World Cup 2024: న్యూయార్క్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా..

దీనికి సంబంధించి “స్టాండింగ్ ఫైనాన్స్ కమీటి” లో అనుమతులు ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని.. వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం లేకుండా పనులు ముందుకు సాగాలని ఆయన సూచించారు. గత పదేండ్లలో ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించడం వల్ల రోడ్లన్ని పాడై రోజు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

Read Also: CAA: పశ్చిమబెంగాల్‌లోని లబ్ధిదారులకు సీఏఏ కింద పౌరసత్వ పత్రాలు: కేంద్రం..