NTV Telugu Site icon

Komati Reddy Venkata Reddy: నేను కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ ను చూసి వచ్చా..!

Ktr Komatireddy Copy

Ktr Komatireddy Copy

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆరేడు వేల ఓట్లు మైనస్ అయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టుకున్నారని.. నేను కేటీఆర్ ఫామ్ హౌజ్ చూసి వచ్చానన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. “నాడు పీసీసీ అధ్యక్షుడు వెళ్లి డ్రోన్ ఎగిరిస్తే కేసు పెట్టారు. పొంగులేటి ఫామ్ హౌజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనే విషయం నాకు తెలియదు. పొంగులేటి ఉండేది హైదరాబాద్ లో.. ఆయనకు సిటీలో ఇల్లు ఉంది. కేటీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్ళినప్పుడు ఆయన భార్య అక్కడ పని చేయిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ కు అక్కడ ఫామ్ హౌజ్ లేదు. జన్వాడ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే. మీడియా వస్తా అంటే నేనే తీసుకు వెళ్తా.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: CM Chandrababu: కన్నయ్యనాయుడిని సన్మానించిన సీఎం చంద్రబాబు

హైడ్రా మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిందని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ల ఇళ్లు, రాజకీయ నాయకుల ఫామ్ హౌజ్ లు, అందరివీ తొలగిస్తామి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. “తెలంగాణ కోసం ఒక్క దెబ్బతిన్నవా?.. మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసాం.. కేసీఆర్ లాగా హాస్పిటల్ లో ఉద్యమం చేయలేదు. రోడ్ల మీద ఉద్యమం చేశాం. కేటీఆర్ కుటుంబం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నదా? రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని ఎలా అంటారు?. రాజీవ్ గాంధీ విగ్రహంను టచ్ చేసిన మరు క్షణమే బీఆర్ఎస్ ఆఫీసులు, ఫామ్ హౌజ్ లు పునాదులతో సహా గాల్లో కలుస్తుంది.” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.