NTV Telugu Site icon

AP Cabinet Decisions: నెలాఖరు నుంచి శ్వేత పత్రాల విడుదల.. వాటిపైనే దృష్టి..

Kolusu Parthasarathy

Kolusu Parthasarathy

AP Cabinet Decisions: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. జరిగిన సుదీర్ఘ చర్చ, తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. ప్రజలరు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది.. మెగా డీఎస్సీ నిర్వహణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం.. ఉపాధ్యాయుల నియామకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ, మేం టీచర్ల నియామకానికి హై ప్రయార్టీ ఇచ్చాం.. 16,347 పోస్టులతో భర్తీ చేశాం. ఆరు నెలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించ లేదు. దీని వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నాణ్యత కలిగిన విద్యని అందించేలా ఎన్ఈపీని స్టడీ చేయమన్నారని తెలిపారు.

Read Also: Farmer Hulchul: కలెక్టరేట్ పైకెక్కి పురుగుల మందు తాగి రైతు హల్‌చల్

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు పార్థసారథి.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్టు ఫీలయ్యారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయి. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. పెన్షన్లు పంపిణీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. 65.30 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారు.. బకాయిలతో సహా రూ.7 వేల పెన్షన్ ఇస్తామన్నారు.. ఈ పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.. ఏడాదికి రూ. 33,709 కోట్లు పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నాం అని పేర్కొన్నారు పార్థసారథి.

Read Also: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 6 నెలల సెలవులు

తమ ప్రభుత్వంలో స్కిల్ సెన్సస్ చేపడతాం అన్నారు మంత్రి పార్థసారథి.. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నాం. పౌష్టికాహారాన్ని పేదలకు రూ. 5కే అందిస్తున్నాం. మొత్తంగా 203 అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసింది. వీటిల్లో 183 క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నాం.. మిగిలిన 20 క్యాంటీన్లను తర్వాత ప్రారంభిస్తాం అని వెల్లడించారు. ఇక, హెల్త్ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దమ్మాలపాటి శ్రీనివాసును ఏజీగా కేబినెట్ ఆమోదం తెలిపింది.. గంజాయి నివారణకు ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. పంచాయతీ, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించిందన్నారు.. మరోవైపు.. ఈ నెలాఖరు నుంచి వరుసగా ఏడు శ్వేత పత్రాలను విడుదల చేయబోతున్నాం. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, శాంతి భద్రతలు, మద్యం, శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై ఈ శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.

Show comments