NTV Telugu Site icon

Minister Kolusu Parthasarathy: ఏపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు..

Kolusu Parthasarathy

Kolusu Parthasarathy

Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం బడ్జెట్‌ కేటాయించిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ 2024-25పై ఏపీ అసెంబ్లీ సమావేశాలో స్పందించిన ఆయన.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ఊరట కలిగిస్తోందన్నారు.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు ఉన్నాయన్నారు.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి లాంటిది.. పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.. చంద్రబాబు ప్రభుత్వం పోలవరంలో 2014-2019 నాటికి 75 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. కానీ, వైఎస్‌ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు.. కేంద్రం సహాయం, సహకారంతో పోలవరం పూర్తిఅవుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.. ఇక వైఎస్‌ జగన్ రాజధానిని మూడు ముక్కలాటలు ఆడారని మండిపడ్డారు.. సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లలా… ముందుకు తీసుకువెళుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రశంసించారు. ఐదేళ్లలో రాష్ట్రం నష్టపోయింది.. ఇప్పుడు తిరిగి గాడిన పెడుతున్న వ్యక్తి సీఎం చంద్రబాబే అన్నారు.. మరోవైపు.. ప్రకాశం జిల్లాను వెనుకబడిన కేంద్రంగా బడ్జెట్ కేంద్రం కేటాయిస్తుందనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.

Read Also: Mallikarjun Kharge: కుర్చీని కాపాడిన రెండు రాష్ట్రాలకే మేలు.. ఖర్గె సంచనల వ్యాఖ్యలు