NTV Telugu Site icon

Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు

Kollu Ravindra

Kollu Ravindra

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఉచిత ఇసుక విధానం అమలుకు విధి విధానాలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Jharkhand: ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా

గత ఐదేళ్ల కాలంలో ఇసుక దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులైన పేదల కడుపు కొట్టిందని.. నిర్మాణాలు నిరంతరాయంగా జరగాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉచిత ఇసుక విధానం అమలు అవుతూందని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సుమారు కొన్ని నెలల పాటు ఇసుక అందకుండా చేసిందన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల కొన్ని కోట్ల మంది నష్టపోయారు.. రోడ్డున పడ్డారని తెలిపారు.

Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?

రాష్ట్రంలో ఇసుక కొరత అనేదే లేకుండా చూస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయాలని ఎవరైనా భావిస్తే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం అనధికారికంగా కొన్ని స్టాక్ పాయింట్లు పెట్టింది.. వాటిని కంట్రోల్‌లోకి తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇసుకను ఆదాయంగా మలుచుకున్న గత ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ఇసుక మాఫియాలో ఎవరు నిందితులుగా ఉన్నారో.. వారందరి పేర్లు వెలికి తీస్తాం.. అన్ని చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు.