Minister Kollu Ravindra: గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుందన్నారు. నాటి మద్యం పాలసీ వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందన్నారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగిందన్న ఆయన.. మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామన్నారు. అక్టోబర్ -1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
Read Also: Sai Dharam Tej: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హీరో సాయి ధరమ్ తేజ్.. రూ.10 లక్షలు విరాళం
ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ పై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రజలే రెడ్ బుక్ ఇచ్చారన్నారు. చేసిన తప్పుల నుంచి జగన్ తప్పించుకోలేరని.. కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు.చంద్రబాబు పది రోజులు కలెక్టరేట్లో ఉండి.. ఇప్పుడు మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారని మంత్రి తెలిపారు.