NTV Telugu Site icon

Minister Atchannaidu: ఒక్క పింఛన్ కూడా తీయం.. ప్రతి ఒక్కరికి అందిస్తాం..

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: ఒక్క పింఛన్ కూడా తీయకుండా.. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేశారు మంత్రి.. పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం ఒకేసారి రూ. 7వేలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల కోసమే ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని వివరించారు..

Read Also: New Criminal Laws: నేటినుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు

ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ వారికి పెన్షన్ తీసేశారు.. సానుభూతిపరులకు వేధించారని మండిపడ్డారు.. అయితే, మా ప్రభుత్వంలో అలాంటి వాటికి తావులేదు.. ఒక్క పింఛన్ కూడా తీయకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అన్నారు.. మరోవైపు.. వాలంటీర్ వ్యవస్థతతో సంబంధంలేకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం.. వాలంటీర్స్ కంటే ఒక గంట ముందే పింఛను పంపిణీ శామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ రోజు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.. మంగళగిరి నియోజకవర్గంలో.. ఉదయమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.. ఇక, ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విషయం విదితమే.