నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజుకు వచ్చిన జనం కూడా.. నిన్న ఆచంటలో జరిగిన చంద్రబాబు నాయుడు సభకు రాలేదని ఆరోపించారు. మరోవైపు.. రాష్ట్రంలోని రైతులకు కోటి పదిలక్షల గన్ని బ్యాగ్స్ ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
Read Also: Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం!
చంద్రబాబు నాయుడు హయాంలో 17 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం సేకరిస్తే.. తాము ఈ నాలుగు సంవత్సరాల్లో 34 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం సేకరించామన్నారు. అంతేకాకుండా.. ఈ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఇదిలాఉంటే.. టీడీఆర్ బాండ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే భారీ అవినీతి జరిగిందని మంత్రి కారుమూరి ఆరోపించారు. టీడీఆర్ బాండ్ విషయంలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో సేకరించిన ధాన్యానికి డబ్బులు వేయడానికి రైతులు పడికాపులు కాయాల్సి వచ్చేది.. తమ ప్రభుత్వంలో మూడు రోజుల్లోనే వారు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతుల దగ్గర నుండి ప్రభుత్వం ధాన్య సేకరిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి వారి దగ్గర నుండి రైస్ మిల్లర్స్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని మంత్రి కారుమూరి తెలిపారు.
Read Also: Abhinandan Vardhaman: అభినందన్ కోసం పాక్ వైపు 9 క్షిపణులను గురిపెట్టిన భారత్..