Site icon NTV Telugu

Kandula Durgesh: గుడ్‌న్యూస్.. త్వరలో అర్ధరాత్రి వరకు హోటల్స్ ఓపెన్..

Kandula Durgesh

Kandula Durgesh

కాకినాడ లో ఏపీ హోటల్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వీరి మధ్య చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. హోటల్ ఓనర్లకు శుభవార్త చెప్పారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు 66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

READ MORE: Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

టూరిజం శాఖకి ఇండస్ట్రీ హోదా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. “పరిశ్రమలకి ఇచ్చే రాయితీలు అన్ని ఇస్తాం. హోటల్ ఇండస్ట్రీస్ పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటల్ ఇండస్ట్రీ ను ముందుకు తీసుకుని వెళ్ళాలి. హోటల్ ఇండస్ట్రీస్ సమస్యలు ను ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. 1217 కోట్లు హోటల్ రంగం పై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు.” అని కందుల దుర్గేష్ తెలిపారు.

READ MORE: Kejriwal: కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం

Exit mobile version