NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: కృష్ణపట్నం పోర్టుకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. వాస్తవాలు వివరించాలనే వచ్చా..

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: కృష్ణపట్నం పోర్టును సందర్శించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కంటైనర్లతో వచ్చిన వెజల్ వివరాలను ఈ సందర్భంగా మంత్రికి వివరించిన పోర్టు అధికారులు.. ఇక, మంత్రి కాకాణి మాట్లాడుతూ.. కృష్ణపట్నం పోర్టును మూసివేస్తారని అందులో భాగంగానే కంటైనర్ మండల్ని ఎత్తు వేస్తారని టీడీపీ నేత సోమిరెడ్డి తప్పుడు ప్రచారం చేశారు అని ఫైర్‌ అయ్యారు. కరోనా వల్ల కంటైనర్ టెర్మినల్ లో కార్యకలాపాలు మందగించాయి అని వివరించిన ఆయన.. కంటైనర్ టెర్మినల్ ను మూసి వేయడం లేదని పోర్టు అధికారులు పదేపదే చెప్పినా.. టీడీపీ నేతలు పట్టించుకోలేదు.. అఖిలపక్షం పేరుతో హడావిడి చేశారు.. ఈ రోజు నాలుగు వేల కంటైనర్లతో షిప్ వచ్చిందని.. 2,800 కంటైనర్లను కృష్ణపట్నం పోర్టులో అన్ లోడ్ చేస్తున్నారని తెలిపారు. అయితే, తాను ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పోర్టుకు వచ్చాను అని వివరించారు.. మరోవైపు, కోర్టులో దొంగతనానికి సంబంధించి సీబీఐ ఎదుట సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడుసార్లు హాజరయ్యారని తెలిపారు. ఛార్జిషీట్‌లో నా ప్రమేయం లేదని సీబీఐ తెలపడంతో ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రవర్తించాలని హితవుపలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

Read Also: IIT Delhi: హాస్టల్ గదిలో ఉరేసుకున్న ఎంటెక్‌ విద్యార్థి!