Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: అందుకోసమే సోమిరెడ్డి నిరసన చేస్తున్నారు.. మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Minister Kakani Govardhan Reddy: తన పార్ట్‌నర్‌కు మైనింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ఆయనకు అండగా ఉండాలని భావించి సోమిరెడ్డి నిరసన చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఫండ్ అవసరమని భావించే భాగస్థుడి కోసం హడావిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయనకు ప్రజా సమస్యలు.. ప్రజాసంక్షేమం పట్టవని.. మైన్స్ యజమాని వద్ద ఎలాంటి కాగితాలు లేవన్నారు. కోర్టుకు వెళ్లడంతో అక్రమమైన గనులను నిరోధించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని.. దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

Read Also: Nagababu: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు

కానీ ఆయన రాత్రి నుంచి అక్కడే పడుకున్నాడని.. వర్గ సమస్యలపై ఏనాడైనా సోమిరెడ్డి ఇలా చేశారా అని మంత్రి ప్రశ్నించారు. మూడుసార్లు మంత్రిగా చేశారు.. అయినా ప్రతి గ్రామం నుంచి కనీసం 10 మంది కూడా సోమిరెడ్డి దగ్గరకి రాలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే సర్వేపల్లి విసర్గంలో టీడీపీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు. దీంతో జనసేన పార్టీ నేతలకు ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారని.. తనను ఎవరూ పట్టించుకోవడంలేదని కలత చెందుతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version