Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: టీడీపీ చచ్చిపోయింది.. పాడె పట్టడానికి పవన్‌ ఆరాటపడుతున్నాడు..

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చచ్చిపోయింది.. దాని పాదయాత్రకు నలుగురు వ్యక్తులు కావాలని.. పాడె పట్టడానికి ముందు వైపు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు.. ఇక, వెనుకవైపు లోకేష్ బాబు ఉండగా.. నాలుగో వ్యక్తిగా పాడె మోయటానికి పవన్ కల్యాణ్‌ ఆరాటపడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, లోకేష్ బాబుకు వ్యవసాయ పంటల పేర్లు కూడా తెలియదు.. మరోవైపు చంద్రబాబు నాయుడుకి మతిమరుపు ఎక్కువగా ఉందంటూ కామెంట్‌ చేశారు.. ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం కూడా చంద్రబాబు మర్చిపోయాడని సెటైర్లు వేసిన ఆయన.. లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాడు.. గతంలో ఆయన ప్రజలకు ఏమి చేశారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. భారతదేశంలో అత్యధిక పింఛను ఇస్తున్నది మన రాష్ట్రమే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

Read Also: Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో బండి సంజయ్ భేటీ

Exit mobile version