NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ సేకరణ మాత్రమే.. ఫలితాలకు కొలమానం కాదు

Kakani

Kakani

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాం.. క్రీడాకారులను ప్రతిభను గుర్తించి.. వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఇవి దోహదం చేస్తాయి.. క్రీడలకు సంబంధించి ఇది ఒక మహా యజ్ఞం లాంటిది.. కొందరు ఆడే వాళ్ళు ఉంటారు.. కొందరు క్రీడలను చూసి ఉత్తేజాం పొందే వారు ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు.. ఐదు క్రీడలను ఆడుదాం.. ఆంధ్ర.. కింద నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ పోటీలు ఉంటాయని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ కొనసాగుతాయి.. రాష్ట్రస్థాయి పోటీలు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.. ఆడుదాం.. ఆంధ్ర.. కోసం గ్రామీణ యువత ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా కేఎస్‌ భరత్‌!

ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప.. పూర్తి ఫలితాలకు కొలమానం కాదు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. కొంత మేర మాత్రమే అభిప్రాయం వస్తుంది.. జిల్లాల్లో తెల్ల రాయి అక్రమ రవాణా పై టిడిపి నేత సోమిరెడ్డి హడావిడి చేస్తున్నారు.. అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు.. మైన్ యజమానులు కలసిన తరువాత దాని గురించి మాట్లాడటం లేదు.. గనుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. 14 మందికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. వీరితో ఒప్పందం కుదరడంతో ఇప్పుడు సిలికాపై పడ్డారు.. ఈ విషయం పై తిరుపతి కలెక్టర్ ను కూడా కలిశారు.. అక్కడా ఒప్పందం కుదిరిందేమో.. అందుకే ఆ విషయాన్ని కూడా మళ్లీ మాట్లాడటం లేదు.. కిరాయికి రాజకీయాలు చేస్తున్నారు.. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లు ఆయనకు అలవాటే అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.