Minister Kakani Govardhan Reddy: ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌పై సోమిరెడ్డి నానా హడావిడి చేశారు.. నిన్న వెజల్ వచ్చి కంటైనర్లను అన్ లోడ్ చేసింది.. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాం.. కానీ, సోమిరెడ్డి మాత్రం అఖిలపక్షం పేరుతో ఆందోళనలు చేశారు.. గతంలో సెంబ్ కార్ప్ విద్యుత్ ప్లాంట్ లో ప్రజలతో కలిసి ఆందోళన చేశారని.. టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబుతో ప్రారంభించారు.. సోమిరెడ్డి తన స్వార్ధ ప్రయోజనాల కోసం.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు.
Read Also: MLC Kavitha: కుల గణన ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు..
ఇక, పోర్టు యాజమాన్యంతో పాటు పరిశ్రమల ప్రతినిధులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటూ సోమిరెడ్డిపై విమర్శలు చేశారు కాకాణి.. తానేమో అధికారంలోకి వస్తామని.. రెండు నెలలు ఆగమని చెబుతున్నారన్న ఆయన.. ఎన్నికల్లో పోటీకి సోమిరెడ్డి పనికిరారని భావించే చంద్రబాబు.. సర్వే చేయిస్తున్నారు.. ఆ సర్వేకి సంబంధించిన కాల్ నాకు కూడా వచ్చిందన్నారు. సైదాపురంలో అక్రమ మైనింగ్ లో నాకు వాటా ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. సోమిరెడ్డి వాటా ఆయనకు వచ్చిందన్నారు. ఇక, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం.. నేను గెలుస్తానని అంటున్నారు.. దానిని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఇప్పటికైనా సోమిరెడ్డి సోమిరెడ్డి తన ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
