Kakani Govardhan Reddy: చంద్రబాబు పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. రైతులను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పంటలు నష్టానికి సంబంధించి ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది.. వాటి గురించి చంద్రబాబుకు తెలియదు అని ఎద్దేవా చేశారు. రైతుల బీమాకు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది.. చంద్రబాబు హయాంలో ఏ ఏ రైతు ప్రీమియం చెల్లిస్తారో ఆ రైతుకే పంట బీమా వచ్చేదని విమర్శించారు. రైతులందరికీ బీమా ద్వారా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారని వెల్లడించారు.
Read Also: Road Accident at Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. టూరిస్ట్ బస్సు బోల్తా
రైతుల కోసం పుట్టానని చంద్రబాబు నటిస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు కాకాణి.. బాబు హయాంలో రైతులు ఎవరూ సంతోషంగా లేరన్న ఆయన.. మనదేశంలో అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.. రంగు మారిన ధాన్యాన్ని కొనాలని ముఖ్యమంత్రి ఇప్పటకే ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రెండు వేల రైతు భరోసా కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలుకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు.. చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు దొంగ పర్యటనలు చేస్తున్నారు.. కొందరు రైతులు వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు.. అందుకే టీడీపీ నేతలతో రైతుల వేషం వేయించి మాట్లాడిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
