Minister Kakani Govardhan Reddy: గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యిందని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు.. కోటి 45 లక్షల కుటుంబాలను పార్టీ నేతలు కలిశారు.. కులాలు.. వర్గాలు.. పార్టీలకు అతీతంగా పథకాలను ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో కలెక్టర్ కు కూడా అధికారాలు లేవు.. అప్పట్లో జన్మ భూమి కమిటీలే లబ్ధిదారులను నిర్ణయించేవారన్న ఆయన.. ఇప్పుడు అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు.. అందుకే ప్రజలు సీఎం వైఎస్ జగన్ స్టికర్ ను తమ ఇంటికి అంటించుకుంటున్నారని తెలిపారు..
Read Also: Balineni Srinivasa Reddy: వైసీపీకి షాక్..! ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు భారత్ రత్న రావడానికి నేనే సిఫారసు చేశానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కాకాణి.. దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో చంద్రబాబు అన్నారని విమర్శించారు.. చంద్రబాబుకు మతిమరుపు పెరిగింది.. ఇప్పుడు పిచ్చి కూడా పట్టిందని కామెంట్ చేశారు.. చంద్రబాబు మంచి పాలన అందించి ఉంటే ఎందుకు 23 స్థానాలకే పరిమితమయ్యారు? అని ప్రశ్నించారు. ఈ సారి కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని వార్నింగ్ ఇచ్చారు.. ఎన్టీఆర్ చేసిన పనులే చెప్పుకుంటున్నారు.. కానీ, తాను ఏమి చేశారో చెప్పలేకపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ విలువలు గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని ఫైర్ అయిన ఆయన.. ప్రతి సర్వేలో కూడా జగన్ కే ప్రజలు మద్దతు ఇస్తున్నారని.. అది చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
