NTV Telugu Site icon

Minister Jogi Ramesh : రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు

Jogi Ramesh Tdp Manifesto

Jogi Ramesh Tdp Manifesto

అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ సహా పలువురు ప్రజా ప్రతినిధుల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. నేను రంగా శిష్యుడినని, రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. కోస్తా జిల్లాల టైగర్ వంగవీటి రంగా అని ఆయన కొనియాడారు. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి రంగా అని ఆయన వ్యాఖ్యానించారు. రంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాలని, రంగా వెన్నులో దిగిన కత్తి.. ఆయనపై విసిరిన బాంబు టీడీపీది కాదా..? చంద్రబాబుది కాదా..? రంగాను చంపింది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పార్టీ కాదా..? రంగా బొమ్మ పెట్టుకుని సైకిల్ గుర్తుకు ఓటేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా..? అని ఆయన నిప్పులు చెరిగారు.

Also Read : Kadiyam Srihari: ’మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరేసి చెప్పండి’ .. కడియం అని

రంగా అంటే ఎవరో తెలియని వ్యక్తి ఆయనకు టీ ఇచ్చానంటాడని, వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. నువ్వు చంద్రబాబు పల్లకీ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా..? అని ఆయన ప్రశ్నించారు. రంగా మాకు దైవం.. గురువు.. ఆయనే మాకు ఆదర్శమని జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దు.. పలకొద్దని ఆయన అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన మాకే ఉందని, రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామన్నారు.

Also Read : Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్‌లోకి కంటైనర్.. 12 మంది మృతి