Site icon NTV Telugu

Jogi Ramesh: జగన్‌ను ఎదుర్కోవడానికి టీడీపీ, చంద్రబాబు సరిపోరు.. అందుకే ఈ పొత్తుల నిర్ణయం

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్‌ను ఎదుర్కోవటానికి ఒక టీడీపీ, ఒక చంద్రబాబు సరిపోరట.. అందుకే ఈ పొత్తులు నిర్ణయం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పవన్‌తో చంద్రబాబు కలిసి వచ్చినా కృష్ణానదిలో కలిసి పోవటమేనని.. వచ్చేది జగన్ సర్కార్ మాత్రమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Chandrababu: పవన్‌ కళ్యాణ్‌ ఇంటికి చంద్రబాబు.. కారణమేంటంటే?

దేశంలో జగన్ మాత్రమే సామాజిక న్యాయం చేయగలిగారని.. చంద్రబాబు ఏనాడైనా మెజార్టీ మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారా అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. రాజ్యసభ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు వెనుక బడిన వర్గాలకే సీఎం జగన్‌ ఇచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. రాజ్యసభ స్థానం ఇస్తామని వర్ల రామయ్యను చంద్ర బాబు మోసం చేశారన్నారు. నందిగామలో మళ్లీ గెలిచేది మొండితోక జగనే అంటూ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.

Exit mobile version