NTV Telugu Site icon

Jogi Ramesh: తాడేపల్లిగూడెం టీడీపీ – జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ రియాక్షన్

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: తాడేపల్లిగూడెం టీడీపీ – జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు. పవన్ రాష్ట్రంలో ఇక్కడ కనపడితే అక్కడ జన సైనికులు ఆయన మక్కెలు విరగ్గొట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. 175 సీట్లలో అభ్యర్దులు పెట్టుకోలేని వ్యక్తి చంద్ర బాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి చెప్పేవి పనికి మాలిన మాటలేనన్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారం కూడా మొదలెట్టి ఎన్నికలకు పూర్తిగా సిద్దమైందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. నేడు తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేనలు ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసీపీ, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌పై మాటలతో విరుచుకుపడ్డారు.

 

Read Also: YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల

 

Show comments