NTV Telugu Site icon

Jogi Ramesh : వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయి

Jogi Ramesh Tdp Manifesto

Jogi Ramesh Tdp Manifesto

వేసవి తరువాత కృష్ణానది నుంచీ నీటిని విడుదల చేశారు మంత్రలు అంబటి రాంబాబు, మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. గతంలో కంటే త్వరగా నీటి విడుదల చేసామన్నారు. వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయని అని ఆయన అన్నారు. రైతులకు వైసీపీ పాలనలో దిగుబడి అధికంగా వచ్చిందని, మద్దతు ధర కూడా లభించిందని ఆయన తెలిపారు. ఇవాళ కృష్ణా డెల్టా వాసులకు పండుగరోజు అని ఆయన పేర్కొన్నారు.

Also Read : WTC Final 2023: ట్రెడిషనల్ డ్రెస్ లో ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్.. ఫోటోలు వైరల్..!

పులిచింతల నిర్మాణం వైఎస్ఆర్ చేసారని, ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారని కొందరు అంటుంటారన్నారు. 12,900 కోట్లు పోలవరం కోసం కేంద్రం నుంచి సాధించారు సీఎం జగన్ అని ఆయన తెలిపారు. పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి ఏం పీకారు అన్న వారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలని ఆయన అన్నారు.

Also Read : South Central Railway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు