తెలంగాణ విమోచన దినోత్సవం, కాంగ్రెస్ 5 గ్యారంటీ కార్యక్రమంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు కొంతమంది సెప్టెంబర్ 17పై లేని అపోహలను సృష్టిస్తున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు.. దేశ మనుగడకు అలాంటి వారు ప్రమాదకరం అని మంత్రి సూచించారు. ఓట్లు, రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్-బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టే చైతన్యం తెలంగాణా సమాజానికి ఉంది అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు.. కాంగ్రెస్ గత చరిత్ర ప్రజలకు తెలుసు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఏం చెప్పిన తెలంగాణ ప్రజలు వినే పరిస్థితిలో లేరు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీవి అన్ని పగటి కలలే అవుతాయని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలో వస్తుంది అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ది చూసి బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయ్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శ్రీరామరక్ష లాగా ఉంటాడని ఆయన తెలిపారు.
Read Also: Priyanka Jawalkar : పవన్ కల్యాణ్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన ప్రియాంక జవాల్కర్..