NTV Telugu Site icon

Minister HarishRao: మర్రిగూడను అభివృద్ధి చేసే బాధ్యత నాది

Harish2

Harish2

ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు అన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మర్రిగూడెం మండలం రాజుపేట తండాలో గ్రామస్థులతో సమావేశమైన మంత్రి హరీష్ రావు. గ్రామస్థులతో కలిసి టిఫిన్ తిన్నారు హరీష్ రావు. ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు జరుగుతాయి అన్న రాజగోపాల్ రెడ్డి 4 సంవత్సరాలలో ఒక కొబ్బరికాయ కూడా కొట్టే సమయం దొరకలేదు…అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది..అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.

టిఫిన్ తింటూ గ్రామస్తులతో హరీష్ మాటామంతీ  

అన్నీ తెలిసిన కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక మంత్రిగా నేను ఉన్నాను.. మర్రిగూడను అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు హరీష్ రావు. మా తండాలు మాకు కావాలని కోరుకున్నారు మన గిరిజన సోదరులు.. గ్రామ పంచాయితీలు కావాలని కోరుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాట తప్పారు. కేసీఆర్ తండాలను గ్రామా పంచాయితీలుగా చేయడం వల్ల మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదన్నారు హరీష్ రావు.

Read ALso: Physical Harassment: ప్రైవేట్ స్కూళ్ళో LKG విద్యార్థినికి వేధింపులు.. కీచక డ్రైవర్ అరెస్ట్

మళ్లీ టీఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకేమైనా చేస్తాడా? మద్యంతో, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలను మర్రిగూడ ప్రజలు తిప్పికొట్టాలి. ఎంబీబీఎస్ లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ తెచ్చాం. 6615 ఎంబీబీఎస్‌ సీట్లలో 661 సీట్లు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి. విద్యలో,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్.. గిరిజనులకు మంచి అవకాశాలు కలుగుతాయి. ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాది లోపు ఇచ్చిన మాటలన్ని అమలు చేస్తాం. ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత నాది.

బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? మోడీ సొంత రాష్ట్రం బీజేపీలో 700 పెన్షన్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో 600 పెన్షన్ ఇచ్చేవాళ్లు, తెలంగాణలో 3000 ఇస్తారంట. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నాడట.. రాజగోపాల్ రెడ్డి అసుంటోడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3000 పెన్షన్ ఇచ్చి తెలంగాణకి వచ్చి ఈ మాటలు చెప్పండి. భూమికి బరువైన పంట పండుతోంది. తెలంగాణలో గింజ మిగలకుండా కొన్నాం. 1000 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చినా.. కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు.

కాంగ్రెస్ పార్టీ లేకుండానే పోయింది, బీజేపీ మందు సీసాలు, పైసలు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటారా? అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ని గెలిపిస్తారా? ఆగం కాకుండా మొదటి డబ్బా మీద 2 నంబర్ బటన్ కారు గుర్తు ప్రభాకర్ రెడ్డి ఫోటో మీద ఓటు వేసి దీవించండి. నా బాధ్యత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.

Read Also: JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా