NTV Telugu Site icon

Harisha Rao : కాంగ్రెస్ హయాంలో నీరు లేదు, కరెంట్ లేదు

Harish Rao

Harish Rao

మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ఊట చెరువు కట్ట వద్ద కోటి 15 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలలో ఒకడు అసెంబ్లీని కులుస్త అంటడు.. ఇంకోడు పేలుస్తా అంటుండు.. కళ్ళలో నీళ్ళు తెప్పించిన కాంగ్రెస్ నయ్యమా.. కాలువలకి నీరు తెచ్చిన కేసీఆర్‌ నయ్యమా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అన్నాడు కేసీఆర్‌.. ఇప్పుడు తెచ్చి చూపించాడని, కాంగ్రెస్ హయాంలో నీరు లేదు, కరెంట్ లేదు ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ వాళ్ళు మోటార్ లకు మీటర్ పెడితే 30 వేల కోట్లు ఇస్తాం అన్నారని ఆయన అన్నారు.

Also Read : Bandi Sanjay : శివాజీ స్పూర్తితో పోరాడదాం.. ఓటు అనే ఆయుధంతో మజ్లిస్‌ను పాతిపెడదాం

కేసీఆర్‌ 30 వేల కోట్ల ఇయ్యకున్న సరే కానీ రైతులకు నష్టం చేయ్యా.. అన్నాడని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, కేంద్రం బడ్జెట్ లో కోతలు పెడుతుందని ఆయన మండిపడ్డారు. మండు వేసవిలో కూడా నీళ్లు మత్తడులు దుంకుతున్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. చేగుంట మండలం బోనాల -ఇబ్రహీంపూర్ వద్ద రామాయంపేట కెనాల్ లో కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చిన గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అలాగే నిజాంపేట మండలం నార్లాపూర్ వద్ద బొల్లికుంట చెరువులోకి గోదావరి జలాలను వదిలారు మంత్రి హరీష్ రావు.

Also Read : GITAM : ప్లేస్‌మెంట్లలో సత్తాచాటిన విద్యార్థులు.. 87 శాతం మందికి జాబ్స్