సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తప్పిపోయో, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్టే ఉంటది అని ఆయన వ్యాఖ్యనించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట.. నడ్డా వచ్చి ఇక్కడ హంగ్ వస్తుంది అంటున్నాడు.. నడ్డా హ్యాట్రిక్ కొడుతం రాసి పెట్టుకో అని హరీశ్ రావు అన్నారు.
Read Also: Nagababu: అబ్బాయిల వల్లే బ్రేకప్ లు, కంట్రోల్ చేయాలనుకునే ఇలా.. నాగబాబు కీలక వ్యాఖ్యలు!
మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం.. ఈ సారి 100 సీట్లు గెలిచి సెంచరీ కొడుతాం అని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Read Also: TPCC Chief: తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది బీఆర్ఎస్ కాదా..?
అయితే, కేసీఆర్ హాయంలో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరికీ సేవా చేస్తున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముళ్లగా కలిసి ఉన్నారు.. కర్ణాటక, బీజేపీ పాలిత రాష్టాల్లో నిద్ర పట్టె పరిస్థితి కుడా లేదు.. కాంగ్రెస్ వాళ్ల మాటలు కోటలు దాటుతాయి.. పార్టీలతో పని లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా రాత్రి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి సంక్షేమ పథకాల చెక్కులు తీసుకున్నారు.. పదేళ్ళలో తెలంగాణను సీఎం కేసీఆర్ ఒక్కొక్క మెట్టు ఎక్కించారు.. గిరిజనులకు సీఎం కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.